స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ ‘రౌడీ జనార్థన‘. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ‘రౌడీ జనార్థన‘ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ.. “రౌడీ జనార్థన టైటిల్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ కథ చెప్పిన కొద్దిసేపటికే విజయ్ ఆ క్యారెక్టర్ లా మాట్లాడటం, చెప్పే సీన్ కు రౌడీ జనార్థనలా స్పందించడం మొదలుపెట్టాడు. కథ ఎంత బాగుందో సినిమాలో ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం అనేది కూడా అంతే బాగుందని దిల్‌రాజు అనేవారు” అని అన్నారు. పొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. “విజయ్ దేవరకొండ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చాడు కానీ తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. విజయ్…పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి యూత్ ఫుల్ మూవీస్ చేశాడు. కానీ ఇప్పటిదాకా ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాడు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిరీష్, ఆనంద్ సి.చంద్రన్, డినో శంకర్ పాల్గొన్నారు.