రైతుల సౌకర్యం కోసమే యూరియా సరఫరాలో యాప్
రైతుల గురించి మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌కు లేదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల పట్ల బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సోమవారం మంత్రి ఓ ప్రకటనలో ఖండించారు. రైతుల సమయాన్ని ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో యాప్ తీసుకొస్తుందని స్పష్టం చేశారు. పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు ? ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరిపడా యూరియా నిల్వలు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను మరింత భయపెట్టే విధంగా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారని మంత్రి ఆరోపించారు.
కొందరు యూరియాను పక్కదారి పట్టించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ మోసాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామీణ ప్రజలు మరొక్కసారి బిఆర్‌ఎస్‌ను తిరస్కరించారన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో సమయాన్ని వృధా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం యాప్ ని తీసుకొస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే యాప్ మీద అనుమానాలు రేకెత్తిస్తు మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించినట్లు మంత్రి గుర్తు చేశారు. యూరియా యాప్‌ను సైతం విజయవంతంగా అమలుచేసి, పారదర్శకంగా యూరియా అందించి, ప్రతిపక్ష నాయకుల అనుమానాలు పటాపంచలు చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
పది సంవత్సరాల పాటు బిఆర్‌ఎస్ నాయకులు చెప్పిన కథలు, చేసిన ఉత్తుత్తి హామీలతో ప్రజలు విసిగెత్తిపోయి మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం లక్ష రుణమాఫీ చేయడానికే నానా అవస్థలు పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని అధికారంలోకి వచ్చిన సంవత్సరలోపే పూర్తి చేసి, రుణమాఫీ కోసం రూ. 20,600 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వరి వేస్తే ఉరి అని బిఆర్‌ఎస్ రైతులను బెదిరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. అలాంటి బిఆర్‌ఎస్ నాయకులు వడ్ల కొనుగోలు, బోనస్‌ల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఏద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా రైతును రాజును చేయాలనే లక్షానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు