టీం ఇండియా బౌలర్ శార్ధూల్ ఠాకూర్ తన అభిమానులకు సర్పైజ్ ఇచ్చాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తన భార్య మిథాలీ పారుల్కర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ‘‘తల్లిదండ్రుల హృదయాల్లో.. నిశ్శబ్దంతో ఇన్నాళ్లు దాగున్న ఓ రహస్యం ఎట్టకేలకు బయటపడింది. తొమ్మిది నెలల అందమైన కలల ప్రయాణం తర్వాత మా కుమారుడు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మా నమ్మకం, అంతులేని ప్రేమకు స్వాగతం పలుకుతున్నాం’’ అంటూ శార్ధూల్ తన సోషల్‌మీడియా ఖాతాలో పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా భారత మిథాలీ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను అతడు షేర్ చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన మిథాలీ-శార్ధూల్‌లకు అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీం ఇండియా స్టార్ కెఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి, భారత మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప భార్య శీతల్, జహీరో ఖాన్ సతీమణి సాగరిక ఘట్కే తదితరులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.