అమరావతి: టీచర్‌తో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె భర్తను పోలీస్ బెదిరించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావు పేట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురజాల సబ్ డివిజన్‌లోలో ఓ వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ మహిళ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెతో కానిస్టేబుల్ చనువుగా ఉండేవాడు. ఈ విషయం భర్తకు తెలియడంతో కానిస్టేబుల్‌ను నిలదీశాడు. దీంతో కానిస్టేబుల్ ఆమె భర్తను బెదిరించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేయడానిక వెళ్తే ఎస్‌ఐ లేడని పోలీసులు అతడిని వెళ్లగొట్టారు. ఫిర్యాదు స్వీకరించకుండా అతడిని వెనక్కి పంపారు. కొన్ని సంవత్సరాల నుంచి అదే పోలీస్ స్టేషన్ లో పని చేస్తుండడంతో ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. సదరు కానిస్టేబుల్ పలుమార్లు అవినీతి పాల్పడినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.