హైదరాబాద్: హీరోయిన్ సమంతకు అభిమానులు చుక్కలు చూపించారు. హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. కారు వద్దకు వెళ్తుండగా సమంతపైకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకొచ్చారు. బౌన్సర్ల సాయంతో సమంత కారు ఎక్కి వెళ్లిపోయింది. ఆమెను కారు వద్దకు తీసుకెళ్ల్లేందుకు బౌన్సర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్న నిధి అగర్వాల్కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రాజాసాబ్ సినిమా ఈవెంట్లో నిధిని అభిమానులు చుట్టుముట్టారు. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్స్ ఇబ్బందులు పడుతున్నారు. హీరోయిన్లపై వెర్రి అభిమానంతో ఇలాంటి చేస్తుండడంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ ను కామంతో తాకినట్టు తెలుస్తోందని విమర్శలు వచ్చాయి.