అమరావతి: అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గి మండలంలో జరిగింది. జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అడిగొప్పుల గ్రామంలో హనుమంతు, శ్రీరామమూర్తి అనే అన్నదమ్ములు ఉండేవారు. ఇంటి ముందే ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకోడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.