భోపాల్: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తండ్రి ఆమెకు అంత్యక్రియలు చేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం విధిశా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సవిత(23) అనే యువతి అదృశ్యం కావడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం వెతకగా ఆమె ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలిసింది. ఆగ్రహం రగిలిపోయిన తండ్రి తన కూతురు చనిపోయిందని బంధువులు, స్నేహితులను పిలిపించాడు. కూతురు ఫొటోను పాడేపై పెట్టి ఊరేగించాడు. శాస్త్రోక్తంగా ఆమె పిండప్రదానం, అంత్యక్రియలు పూర్తి చేశాడు. 23 ఏళ్లు కనిపెంచిన తండ్రికి గుండె కోత మిగిల్చారని కూతురుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.