కాషాయ పార్టీ ఖాతాలోకి 82 శాతం నిధులు
కాంగ్రెస్‌కు రూ.296 కోట్లు, టిఎంసి రూ.102 కోట్లు, బిఆర్‌ఎస్ రూ.10 కోట్లు
పార్టీలకు పంపిణీ చేసిన ఎలక్టోరల్ ట్రస్ట్‌లు
న్యూఢిల్లీ: కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన వి రాళాలను రాజకీయ పార్టీలకు పంపిణీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కంపెనీలు ఏర్పాటు చేసిన ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నిధులలో అధికార భారతీయ జనతా పార్టీకే పెద్ద పీట దక్కింది. 2024-25 సంవత్సరంలో తొమ్మిది ఎలక్టోరల్ ట్రస్ట్‌లు పం పిణీ చేసిన రూ.3,811.34 కోట్లలో బీజేపీకి రూ.3,142.65కోట్లు అందాయి. అంటే మొ త్తం నిధులలో 82.45 శాతం అన్నమాట. ట్రస్ట్ ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన నివేదికల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రె స్ పార్టీకి రూ.296.76 కోట్లు అందాయి అంటే 7.83 శాతం. కాగా, తృణమూల్ కాంగ్రెస్ పా ర్టీకి రూ.102కోట్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.98కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ.44 కోట్లు, బిఆర్‌ఎస్ పార్టీకి రూ.10 కోట్లు, బిజెడికి రూ.15 కోట్లు, తమిళనాడు డిఎంకె పార్టీకి రూ.10 కోట్ల మేరకు నిధులు అందాయి.
ఇంతవరకూ మొత్తం 19 ఎలక్టోరల్ ట్రస్ట్‌లలో 13 ట్రస్ట్ లు నివేదికలు నివేదికలు సమర్పించాయి. కాగా నాలుగు ట్రస్ట్‌లు తాము ఎటువంటి నిధులను అందుకోలేదని, ఎవరికీ పంపిణీ చేయలేదని పేర్కొన్నాయి. ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌లు పార్టీల కు పంపిణీ చేసిన నిధుల వివరాలు ఇలా ఉన్నా యి. ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.2,658. 49 కోట్లు అందుకోగా, రూ.2,668.46 కోట్లు పార్టీలకు పంపిణీ చేసింది. కాగా ప్రోగ్రెసివ్ ట్రస్ట్ రూ.915 కోట్లు అందుకుని రూ.914.97 కోట్లు పంపిణీ చేసింది.
న్యూ డెమోక్రటిక్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ రూ.160 కోట్లు అందుకుని రూ. 160కోట్లు పార్టీలకు పంపిణీ చేయగా, హార్మో ని ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.35.56కోట్లు అందుకు ని రూ.35.66 కోట్లు, పార్టీలకు అందజేసింది. ఇక ట్రయంఫ్ ట్రస్ట్ రూ.25 కోట్లు అందుకుని పూర్తిగా పంపిణీ చేసింది. అలాగే సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ అసోసియేషన్ రూ.6కోట్లు అందుకుని అంతా పంపిణీ చేయగా, జన ప్రగతి ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.1.02 కోట్లు అందుకుని కోటి రూపాయలు పంపిణీ చేసింది. ఇక జన కల్యా ణ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ రూ.20 లక్షలు అందుకుని రూ. 19 కోట్లు పంపిణీ చేయగా, ఇంజిగార్డిగ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.8 లక్షలు అందుకుని రూ. 7,75 లక్షలు రాజకీయ పార్టీలకు పంపిణీ చేసింది.