కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రివాల్వర్ రీటా’. జికె చందు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళని స్వామి సంయుక్తంగా నిర్మించారు. తండ్రి లేని కుటుంబాన్ని ఓ బేకరిలో పని చేస్తూ చూసుకొనే అమ్మాయి జీవితంలో గ్యాంగ్‌స్టర్స్ ప్రవేశించడంతో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా కథాంశం.
గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. తాజాగా ఈ మూవీ ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్ల్సీ కీలక పాత్రలు పోషించారు. మరి బుల్లితెరపై ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి.