దుబాయ్: అండర్-19 ఆసియాకప్ ఫైనల్స్‌లో పాకిస్థాన్ ఆటగాడు సమీర్ మిన్హస్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకొని పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆరంభంలోనే హెనిల్ పటేల్ షాక్ ఇచ్చాడు. 31 పరుగుల స్కోర్ వద్ద ఓపెనర్ హంజా జహుర్(18)ని పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మరో ఓపెరనర్ సమీర్ జట్టు భారాన్ని తనపై వేసుకున్నాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు. మరోవైపు ఉస్మాన్ ఖాన్(35) మంచి సహకారం అందించాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. సమీర్ (99 బంతుల్లో 147 నరుగెలు), ఫర్హాన్(8) ఉన్నారు.