శాసనసభలో చట్టం తెస్తాం
మత ప్రాతిపదికన దాడులకు ప్రయత్నించిన వారిని ప్రభుత్వం ఆణచివేసింది
మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలు ఎవరి దయా కాదు
ఏసుక్రీస్తు బోధనల స్ఫూర్తితోనే మా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది
క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమ్రంతి రేవంత్‌రెడ్డి
వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు
మనతెలంగాణ/హైదరాబాద్: మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రేమను పంచాలని, శాంతిని పెంచాలని ఏసుక్రీస్తు చాటారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ద్వేషించే వారిని సైతం ప్రేమించాలని మానవాళికి ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారని ఆయన అన్నారు. ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల మిరాకిల్ మంత్‌గా ఆయన అభివర్ణించారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా సిఎం రేవంత్‌రెడ్డి చిన్నారులకు క్రిస్మస్ బహుమతులను అందజేశారు. క్రిస్టియన్ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. డిసెంబర్ నెల క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాదనీ, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మిరాకిల్ మంత్ అని, కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టింది కూడా డిసెంబర్ నెలలోనే ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా డిసెంబర్ నెల అని ఆయన తెలిపారు.
ఏసుక్రీస్తు బోధనల స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది
ప్రభువు బోధనల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంద ని, ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపామని ఆయన అన్నారు.
మైనారిటీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదు
ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు అందించాయని, ఒక యుద్ధంలా, యజ్ఞంలా అంకితభావంతో ప్రభుత్వంతో పో టీ పడి పేదలకు విద్య, వైద్యాన్ని అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని, మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని ప్రభుత్వం అణచివేసిందని, ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా శాసనసభలో చట్టం తెస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రిస్టియన్, ముస్లిం స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తామని ఆయ న తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెం ట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతామని, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్ గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.