మన తెలంగాణ/హైదరాబాద్: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో రైల్వే వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్ల 3 లక్షల 75వేలు మంజూరు చేసింది, మిగిలిన పరిహారం మొత్తాన్ని మడికొండలోని శ్రీసీతా రామ ఆలయం తరపున ఆలయ ఖాతాలో జమచేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి వికాస్ రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.