అమరావతి: కర్టాటక జిల్లాలో పావుగడ పట్టణం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ నుంచి పావుగడ వెళ్తున్న ఎపి ఆర్టిసి బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.