చెన్నై: తండ్రి పేరిట మూడు కోట్లు బీమా చేయించి ఇద్దరు కుమారులు కలిసి ఆయనను పాము కాటుతో చంపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గణేశన్(56) అనే వ్యక్తి ఓ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడి పని చేస్తున్నాడు. తండ్రి పేరిట కుమారుడు దాదాపుగా రూ.3 కోట్ల రూపాయల బీమా చేయించారు. గణేశన్ పాము కాటుతో చనిపోయాడు. బీమా క్లెయిమ్‌ల కోసం ఇద్దరు కుమారులు బీమా సంస్థను కలిశారు. తండ్రి పేరిట మూడు కోట్ల రూపాయల బీమా క్లెయిమ్ ఉండడంతో పాటు బీమా సంస్థ ఉద్యోగులకు అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. గణేశన్ మృతి చెందిన వారానికి ఆయనను పాము కరవడంతో ఆస్పత్రికి తరలించారు. విషపూరితమైన పాము కాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో కుమారులు ఇద్దరు తండ్రిని నిద్ర పోతుండగా అతడి మెడ వద్ద పామును వదిలారు. పాము కరించిందని తండ్రి కేకలు వేయడంతో వెంటనే పామును చంపేశారు. అనంతరం తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు తండ్రి మృతి చెందాడు. పాము కాటుతోనే తండ్రి చనిపోయాడని అందరినీ నమ్మించారు. బీమా సొమ్ము కోసం క్లెయిమ్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.