అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో యథేచ్ఛగా గంజాయి సాగు చేస్తున్నారు. దేగులపాడు గ్రామంలో భారీగా గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేగులపాడు గ్రామానికి చెందిన శివయ్య అనే రైతు మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. పోలీసులకు సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకొని గంజాయి మొక్కలను పీకి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక లీడర్ల అండతోనే శివయ్య అనే రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతి త్వరలో మూడు పువ్వులు ఆరు కాయలు లాగా గంజాయి సాగు చేస్తే గంజాయాంధ్రపదేశ్ గా మారుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంజాయి అమ్మేవారిని, కొనేవారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తే మత్తు పదార్థాల జోలికి ఎవరు వెళ్లారని తెలిపారు.