మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాలతో (పీఎసీఎ స్) పాటు 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను శుక్రవారం రద్దు చేస్తూ వ్యవసాయ సహకార శాఖ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో ఆరు నెలల పదవీకాలంతో పర్సన్ ఇన్‌ఛార్జిలను ప్రభుత్వం నియమించింది. వీరు తదుపరి ఎన్నిక లు నిర్వహించే వరకు కొనసాగుతారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిని పునర్‌వ్యవస్థీకరించాకే వీటికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు ల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాలు, 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల పా లకవర్గాలు రద్దయ్యాయి. అలాగే తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కూడా పర్సన్ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. దీనికి కో ఆపరేటివ్ అండ్ రిజిస్టార్ ఆప్ కో ఆ పరేషన్ సొసైటీస్ పర్సన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిఎసీఎస్‌లు, డీసీసీబీల పునర్ వ్యవస్థీకరణ,
ఎన్నికలు నిర్వహించిన అనంతరం వీటికి పాలకవర్గాలను నియమించనున్నట్లు పేర్కొన్నారు. పిఎసిఎస్‌లకు ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ వాటి పదవీకాలాన్ని ఆగస్టు వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ప్రస్తుతం రద్దు చేసిన 9 డిసిసిబిల పదవీ కాలం ఆగస్టు 14 నే ముగిసింది. దీంతో తాజాగా పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకంతో పిఏసీఎస్‌లకు, అలాగే డీసీసీబీలు ఇక నుంచి పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. 9 డీసీసీబీ బ్యాంకులకు ఇక నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.