గత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కేసులో ఎండి కాకర్ల శ్రీనివాస్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చెన్నైలో అదుపులోకి తీసుకుంది. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కాకర్ల శ్రీనివాస్ పలువురి నుంచి రూ.60కోట్లకు పైగా వ సూలు చేశాడు. గతంలో హైదరాబాద్ సి సిఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఇడి మరో కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టిం ది. కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ లో నగరంలోని 8చోట్ల సోదాలు నిర్వహించింది. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలను స్తం భింపజేసింది. ఈ క్రమంలో పరారీలో ఉన్న కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది.