సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన ఐదో, చివరి టి20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 31 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. చెలరేగి ఆడిన డికాక్ 35 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 65 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 17 బంతుల్లోనే 31 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలం కావడంతో సఫారీకి ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు, బుమ్రా రెండు వికెట్లను పడగొట్టారు.
శుభారంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు దూకుడుగా ఆడి స్కోరును పరిగెత్తించారు.దూకుడుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ ఆరు ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన శాంసన్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 22 బంతుల్లోనే37 పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి నిరాశ పరిచాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యలు చెలరేగి ఆడారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ 42 బంతుల్లోనే పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేశాడు. మరోవైపు హార్దిక్ 25 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, 5 ఫోర్లతో63 పరుగులు సాధించాడు.శివమ్ దూబె 3 బంతుల్లోనే అజేయంగా 10 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 231 పరుగులకు చేరింది.