శ్రీశైలం: సోషల్‌మీడియా వాడకం కొందరు మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరి కొందరు మాత్రం తమ ఫాలొయింగ్, లైక్స్, షేర్లు, కామెంట్ల కోసం ఇష్టారీతిన ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తూ తమ అందాలను ఆరబోస్తున్నారు. ఇంకొందరైతే.. ప్రదేశం ఖాళీగా కనిపిస్తే చాలు.. అది ఎక్కడా, ఏమీ అని ఆలోచించకుండా రీల్స్ చేస్తుంటారు. తాజాగా ఓ యువతి శ్రీశైలం ఆలయ సమీపంలో డ్యాన్స్ చేసి.. అందరిని ఆగ్రహానికి గురి చేసింది.
పవిత్రమైన శ్రీశైలం ఆలయ సమీపంలో ఆపచారం చోటు చేసుకుంది. ఓ యువతి శ్రీశైల క్షేత్ర పరిధిలో సాంప్రదాయాన్ని మంటగలుపుతూ.. ఓ యువతి ఫోక్ పాటకి చిందులు వేసింది. పట్టపగలు నడిరోడ్డుపై రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. యువతి చేసిన పనికి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టా దెబ్బ తీసేలా యువతి వ్యవహరించిందంటూ మండిపడుతున్నారు. అయితే యువతి చేసిన ఈ పనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.