హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐటి ఉద్యోగుల టార్గెట్ చేసుకొని గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్ అనే వ్యక్తిని మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. సోహెల్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 17 కేజీల గంజాయి, 2 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి గంజాయి తెచ్చి ఐటి ఉద్యోగులకు సోహెల్ సరఫరా చేస్తున్నారు. సోహెల్‌తో పాటు గంజాయి వినియోగించిన 5 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.