దుబాయ్: యుఎఇలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. శిథిలావస్థలకు చేరుకున్న భవనాలు కుప్పకూలిపోతున్నాయి. రాస్ ఆల్ ఖైమా ప్రాంతంలో గోడ కూలడంతో భారతీయుడు మృతి చెందాడు. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు సల్మాన్ ఫరీజ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. భవనం గోడ కూలిపోవడంతో సల్మాన్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.