మనతెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్‌కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషన ర్ సజ్జనార్ నేతృత్వంలో ఐపిఎస్ అధికారులతో మరో సిట్‌ను ఏర్పాటు చేస్తూ డిజి పి శివధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జా రీ చేశారు. ఈ సిట్‌లో సభ్యులుగా రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డిసిపి రితురాజ్, మహేశ్వ రం డిసిపి నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డిసిపి కెఎస్ రావు, జూబ్లీహిల్స్ ఎసిపి వెంకటగిరి, టిజి న్యాబ్ డిఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న నాగేందర్‌లు ఉన్నారు.