రైలు మొదటి జనరల్ బోగి కింద మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి వెళ్తున్న ప్రత్యేక రైలు(07043) లో శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే జనరల్ బోగి కింద మంటలు చెలరేగాయి.గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పి వేశారు. బ్రేక్ జామ్ అయ్యి మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.