సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ టైటిల్ ను ఝార్ఖండ్ జట్టు కైవసం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్ లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఝార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 262 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (101; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్ లు) సెంచరీ చేశాడు. కుమార్ కుశాగ్రా(81; 38 బంతుల్లో 8 ఫోర్లు,5 సిక్స్ లు) మెరుపులు మెరిపించాడు. 263 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన హరియాణా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. హరియాణా బ్యాటర్లలో యశ్వర్థన్ (53; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ లు) ,నిశాంత్ సింధు(31; 15 బంతుల్లో 6 ఫోర్లు), సమంత్ జాఖర్ (38; 17 బంతుల్లో 2 ఫోర్లు,4 సిక్స్ లు) రాణించారు. ఝార్ఖండ్ బౌలర్లలో బాల క్రిష్ణ 3,సుశాంత్ మిశ్రా 3, అనుకుల్ రాయ్,వికాష్ సింగ్ రెండేసి వికొట్లు తీశారు.