సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ లో హరియాణా, ఝార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హిరియాణా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఝార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 262 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (101; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్ లు) సెంచరీ చేశాడు. కుమార్ కుశాగ్రా(81; 38 బంతుల్లో 8 ఫోర్లు,5 సిక్స్ లు) మెరుపులు మెరిపించాడు.రాబిన్ మింజ్(31;14 బంతుల్లో 3 సిక్స్ లు), అనుకుల్ రాయ్(40; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు చేశారు.