హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు.. సాయిపూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొట్టి చంపాడు భర్త. తీవ్రంగా కొట్టడంతో భార్య గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య మరణం అనంతరం భర్త పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేస్తుకున్నారు. భర్త పరమేశ్(28), మృతురాలు అనూష(22)గా పోలీసులు గుర్తించారు.