ఒమన్: ఇరు దేశాల మధ్య మైత్రి బంధం బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ ఆర్థికంగా వేగంగా పురోగమిస్తోందని, గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు ఐదు రెట్లు మెరుగయ్యాయని, రైల్వే లైన్లు, ఫైఓవర్లు, ఎక్స్‌ప్రెస్ వేలను శరవేగంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఒమన్ ఉప ప్రధానితో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఒమన్‌లో రెండో రోజు భారతీయులతో ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ జరిపారు. స్కూల్ విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. వికసిత్ భారత్‌లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీది కీలక భూమిక పోషిస్తుందని, ఒమన్‌లో తాను ఒక మినీ ఇండియాను చూస్తున్నానని ప్రశంసించారు. గ్రీన్ గ్రోత్ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని కొనియాడారు. తాము భారత్‌లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు నేడు దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్‌గా నిలిచిందని మెచ్చుకున్నారు. దేశంలో ఆర్థిక క్రమశిక్షణతో పాటు పారదర్శకతను పెంచామని, దీంతో అంతర్జాతీయ పెట్టుబడుదారుల్లో భారత పట్ల నమ్మకం ఏర్పడిందన్నారు. పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోశామని, మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా మహా సముద్రంలో రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారిధి ఏర్పాటు చేశామన్నారు. జిఎస్‌టి అమలు చేయడంతో భారత దేశం ఒకే సమీకృత మార్కెట్ మారిందని ప్రధాని వివరించారు.