హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీను ఇడి కేసులతో వేధిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎఐసిసి పిలుపు మేరకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీభవన్ నుంచి బిజెపి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిగింది. బిజెపి కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయుకులు ధర్నా తల పెట్టారు. వివిధ జిల్లాల నుంచి గాంధీభవన్ కు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. గాంధీభవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నిరసన పాల్గొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గాంధీభవన్ గేట్లు పోలీసులు మూసేయడంతో గాంధీభవన్ గేట్లు దాటేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు.