హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ లో విద్యుత్ కు రూ.21 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, కేటాయించిన బడ్జెట్ తో విద్యుత్ బకాయిలు తీర్చే పరిస్థితి లేదని అన్నారు. విద్యుత్ ఉచిత పథకాలకు కూడా బడ్జెట్ ఏ మాత్రం సరిపోదని, విద్కుత్ కు సంబంధించి పాత బకాయిలపై దృష్టి పెట్టలేదని కిషన్ రెడ్డి తెలియజేశారు. విద్యుత్ ఉద్యోగుల జీత భత్యాల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీలో భాగంగా లక్ష్యాలు ఘనంగా ఉన్నాయని విమర్శించారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.