గుడిహత్నూరు: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొండి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఐపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, గుంపులుగా ఉన్న వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మావల ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలీసు జీపును గ్రామస్తులు ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.