స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ’ఛాంపియన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి గొప్ప సంస్థ చేస్తున్న సినిమాతో తెలుగుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. -నిజానికి తెలుగు భాష మీద నాకు పెద్ద అవగాహన లేదు.
అయితే చాంపియన్ డైరెక్టర్ ప్రదీప్, అలాగే యూనిట్లో అందరూ కూడా నాకు భాష విషయంలో ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్ల సపోర్ట్ తోనే నేను తెలుగులో డైలాగ్స్ అంత చక్కగా పలకగలిగాను. గిరగిరా సాంగ్‌కి వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది. రోషన్ అద్భుతమైన డాన్సర్. తన నుంచి కొన్ని డాన్సింగ్ మెలకువలు కూడా నేర్చుకున్నాను. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇలాంటి కథ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక మంచి సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో నేను చేసిన చంద్రకళ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. -ఈ పాత్ర చేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మిక్కీ జే మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. -ఇక ప్రస్తుతం ‘ఇట్లు మీ అర్జున’ చేస్తున్నాను”అని అన్నారు.