అమరావతి: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని తన కుమారుడి ఇంట్లో సుతార్ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, హైదరాబాద్‌లోని బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రామ్ సుతార్‌లో నిర్మించారు. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూరు గ్రామంలో రామ్‌సుతార్ జన్మించారు. రామ్ సుతార్‌కు 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి.