రాంఛీ: ఏనుగు బీభత్సం సృష్టించడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాస్ట్రం రాంఘర్ లో జరిగింది. ఏనుగుల గుంపు వెళ్తుండగా స్థానికులు సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. స్థానికులపై ఏనుగు దాడి చేయడంతో అందరూ పరుగులు తీశారు. ఏనుగు ఒకరిని తొండంతో కొట్టి కిందపడేసింది. అతడు పలుమార్లు తొక్కడంతో పాటు దంతాలతో పొడవడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికుల సమాచారం మేరు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఏనుగుల గుంపును తరిమేశారు.