అమరావతి: యువజంట ఒంటరిగా ఉండడం గమనించి యువకుడిని ఓ రౌడీషీటర్ చితకబాది అనంతరం యువతిపై అతడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నరసాపురానికి చెందిన ఓ బాలిక కొవ్వూరులో ఇంటర్మీడియట్ చదువుతోంది. డిసెంబర్ 15న రాత్రి 11 గంటల సమయంలో తన స్నేహితుడితో కలిసి జైలు రోడ్డులోని ఓ పార్కు వద్దకు యువతి వెళ్లింది. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ రేగుళ్ల ఆనంద్, అతడి స్నేహితుడు గణేష్ మద్యం మత్తులో అటుగా వెళ్తున్నారు. యువతి, యువకుడు కనిపించడంతో అతడిని తీవ్రంగా కొట్టి యువతిని ఆనంద్, గణేష్ ఎత్తుకెళ్లారు. అనంతరం ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి రౌడీషీటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రౌడీషీటర్‌పై గతంలో పలు కేసులున్నట్టు సమాచారం. అతడిపై పిడి చట్టం అమలు చేయగా జైలు నుంచి బయటకు వచ్చాడు.