మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల ప్రమాణ స్వీ కార తేదీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 20వ తేదీకి బదులు 22వ తేదీన కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈనెల 20వ తేదీన ముహూర్తాలు బాగోలేవం టూ ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వినతుల రావడంతో ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. రా ష్ట్రంలో కొత్తగా ఎన్నికైన పంచాయతీ పా లకవర్గాలు కొలువు దీరేందుకు ఈనెల 20వ తేదీన ప్రభుత్వం మొదట ముహు ర్తం ఖరారు చేంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల తొలి సమావేశం నిర్వహించడంతో పాటు నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించింది. కానీ, ఈనెల 20వ తేదీన ముహుర్తాలు బాగోలేవని ప్రమాణ స్వీకార తేదీ మార్చాలంటూ ప్రభుత్వానికి పలువురు ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈనెల 22వ తేదీన కొత్త సర్పంచ్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది.