లక్నో: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ రద్దయ్యింది. రాత్రి ఏడు గంటల నుంచి లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పొగమంచు ప్రభావంతో కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. సాయంత్రం నుంచే ఎకానా స్టేడియం పరిసరాలు పొగమంచుతో నిండిపోయాయి. దీంతో సాయంత్రం 6.30 గంటలకు వేయాల్సిన టాస్ సాధ్యపడలేదు. తర్వాత మంచు ప్రభావం మరింత పెరిగిపోయింది. పలుసార్లు మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు చివరికి రాత్రి 9.30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజులుగా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో మంచు అధికంగా పడుతోంది. సాయంత్ర నాలుగు గంటల నుంచే దీని ప్రభావం కనిపిస్తోంది. తాజాగా లక్నోలో జరగాల్సిన టి20 మ్యాచ్‌పై కూడా దీని ప్రభావం పడింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది.