ఓ పాత ఇనుప సామాన్ల డంఫింగ్ యార్డ్ భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.