ఈ ఏడాది ‘భైరవం’ సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఆ తర్వాత ‘మిరాయ్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ప్రస్తుతం మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న రీసెంట్ సినిమా ‘డేవిడ్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో మనోజ్ చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. గ్లింప్స్ చూస్తే సినిమా ఓ రేంజ్‌లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించారు. ఇంకెందుక ఆలస్యం.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్‌ను మీరూ చూసేయండి…
War Dog… Ready to Roar 🔥🔥🔥
Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025