కొత్తగూడ మండల కేంద్రంలోనీ పోగుళ్లపల్లి పోలింగ్ కేంద్రంలో బుధవారం ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారాని పోలీస్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నునావత్ ఈర్య నాయక్ చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్న వారిని బయటికి పంపించారు. కానీ అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ బానోత్ మోహన్, వీరస్వామి లు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల తోపులాటలో నునావత్ స్వాతికి ఎముక ప్యాక్చర్ అయింది. సమాచారం తెలుసుకున్న గూడూరు సీఐ జి సూర్య ప్రకాష్ సదర్ వ్యక్తులను పోలింగ్ కేంద్రం నుండి వెళ్లగొట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.