ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీసత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు మండలం నాగిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. చాకెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిన్నారిని వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.