నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి‘. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలనే అందరం కష్టపడ్డాం అని అన్నారు. ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ “బ్రహ్మానందం ప్రతి సందర్భంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. నరేష్ అగస్త్య అద్భుతంగా నటించాడు. ఫరియా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది”అని తెలిపారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి సినిమాలో నేను ముఖ్యమైన పాత్ర చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, నిరంజన్, కృష్ణ సౌరభ్ తదితరులు పాల్గొన్నారు.