హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్, హీరో నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పాత్రల్లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన-, దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది ఈ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అడివి సాయి కిరణ్, రావుల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతంగా నటించారని నిర్మాత బాలకృష్ణ మహారాణా తెలిపారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ప్రేమ, పగ, తప్పు -ఒప్పు, మంచి- చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం అని అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ “డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశాను. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫుల్ కామెడీ చేశాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది”అని పేర్కొన్నారు.