మన తెలంగాణ/కేపీహెచ్‌బి: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ఐడీపిఎల్ భూముల కబ్జా, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరస్పర ఆరోపణల నేపధ్యంలో ప్రభు త్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు సర్వే నెంబర్ 376లోని భూములపై దర్యాప్తునకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జాగృతి జనం బాట పేరుతో కూకట్‌పల్లిలో ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గత పదేళ్ళలో పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను, చె రువు శిఖం భూములను కబ్జా చేశారని, ఐడీపిఎల్ భూములను కబ్జా చేశారని విలేకరుల సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కృష్ణారావు తీవ్రస్థాయిలో కవిత ఆమె భర్త అనిల్ ఐడీపిఎల్ భూములను కబ్జా చేశారని, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు. దీనిపై ప్రభుత్వం ఎలాం టి విచారణ అయినా జరపించుకోవచ్చన్నారు. దీంతో ప్ర భుత్వం ఐడీపిఎల్ భూములు ఎంతమేరకు కబ్జాకు గురయ్యాయో వంటి వాస్తవాలను తెలుసుకునేందుకు విజలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ జరువాత వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని భా విస్తున్నారు. కూకట్‌పల్లిలో ఐడీపీఎల్‌కు
భూములను రెసిడెన్సియల్ కిందకు కన్వర్టు చేసి బడా నిర్మాణ సంస్థలకు విక్రయించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. కొనసాగుతున్న ఐడీఎల్ కంపెనీని పథకం క్రారం మూసివేసి విలువైన 700 ఎకరాల భూములను బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టడం వెనుక స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, ఈ వ్యవహారంలో దుబాయి కేంద్రంగా భారీ ఒప్పందం జరిగిందని స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పరిశ్రమల జోన్ నుంచి భూమిని తప్పించి రెసిడెన్సియల్ జోన్ కింద మార్చినందుకు ఒక్కో నాయకుడికి కోట్లలో లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఐడీపిఎల్ కంపెనీని రెండు దశబ్ధాల కింద టేకోవర్ చేసుకున్న హిందూజా సంస్థ ప్రభుత్వ అండదండలతో ఆఘమేఘాలమీద ప్లాటింగ్‌చేసి బడా నిర్మాణ సంస్థలకు విక్రయించింది. ప్రస్తుతం ఈ భూముల్లో అతివేగంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించి నిజా నిజాలను నిగ్గుతేల్చాలని కూకట్‌పల్లి వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.