రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. 2026 మార్చి 3న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ -2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను 4వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మార్చి 3న హోలీ పండుగ సెలవు నేపథ్యంలో ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ రాత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు.. రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి.
ఉదయం 9- నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం -5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్(20 మార్కులకు).. ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న, సెకండియర్‌కు 22న జరుగుతాయి. ప్రథమ ఏడాది విద్యార్థులకు జనవరి 23న ఎథిక్స్ పరీక్ష, 24న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకూ ఇవే తేదీలు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అయితే, ప్రత్యేకంగా టైం ం విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే.