న్యూయార్క్: పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్‌కు ముప్పు తలపెట్టడం పైనే ఉందని, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపి, అతడికి విరోధి అయిన అసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే ఉందని చురకలంటించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్‌షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన చర్చలో పాకిస్తాన్ మరోసారి జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.