కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, చింతలమానెపల్లి మండలం, బాలాజీ అనుకోడ గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి వగాడి శంకర్ మంగళవారం గ్రామంలో విచిత్రమైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయని వారు.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ, లేదంటే తనకు ఓటు వేశారని గుర్తుగా పసుపు బియ్యం పట్టాలంటూ భార్యాపిల్లలతో కలిసి మంగళహారతిలో పసుపు, బియ్యం తీసుకొని ఇంటింటికీ తిరిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని ఇంటికి పంపించారు.