కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలోని అడవుల్లో 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారంతా చిక్కినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ పేరట కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి సాధించటంతో చత్తీస్‌గఢ్ నుండి మావోలు తెలంగాణలో తలదాచుకోవడానికి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలపడంతో రాష్ట్ర పోలీసులు అడవుల్లోలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా సోమవారం రాత్రి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావుతోపాటు మరో 15 మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మంగళవారం మధ్యాహ్నం విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది.