తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళంలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేశ్. రీసెంట్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య పలు భాషల్లో సినిమాలతో బిజీగా ఉంది. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’. ఈ సినిమా తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ పేరు విడుదలైంది. అర్జున్ సార్జా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
గత నెల 21న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సరైన ప్రమోషన్స్ చేయకుండా విడుదల చేసే సరికి సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో కూడా జనాలకు తెలియదు. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో హత్య జరుగుతుంది. ఆ కేసును ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సార్జా) దర్యాప్తు చేస్తాడు. మరి అసలైన నిందితుడుని పట్టుకున్నాడా లేదా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటి? ఇందులో ఐశ్వర్యా రాజేశ్ పాత్రేంటి అనేది మిగతా స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఈ శుక్రవారం(డిసెంబర్ 19) నుంచి ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.