హైదరాబాద్: పార్టీ నేతలు గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. వార్డుల పునర్విభజనను బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జిహెచ్ ఎంసిలో విలీన ప్రాంతాల జిల్లా బిజెపి అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పెంపుపై సమావేశంలోచర్చ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్థానిక సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలని, మనం రాజకీయ వర్కర్స్ అనేది గుర్తించి పనిచేయాలని సూచించారు. బిజెపి మేయర్ పదవిని తప్పని సరిగా గెలవాలని రామచందర్ రావు పేర్కొన్నారు.