ఈ ఏడాది ‘ఒజి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు పవన్‌కల్యాణ్. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా మారింది. అయితే తనతో ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడు సుజీత్‌కి పవన్ ఓ మంచి గిఫ్ట్ ఇచ్చారు. సుజీత్‌కి ల్యాండ్‌రోవర్ డిఫెండర్ కారును ఆయన కానుకగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సుజీత్ సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు. ‘‘బాల్యం నుంచ పవన్ అభిమానిని అయిన నేను ఇప్పుడు ఆయన్నుంచి గిఫ్ట్ అందుకున్నా. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ఒజి పవన్‌కల్యాణ్ ప్రేమ, ప్రోత్సాహం మరువలేనివి. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా’’ అని సుజీత్ రాసుకొచ్చాడు. పవన్‌తో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.